బాహుబలికి ప్రభాస్‌ సాహో అనాల్సిందే !

175
Prabhas in 50 Most Influential Indians
Prabhas in 50 Most Influential Indians
- Advertisement -

బాహుబలి మూవీ కోసం 4ఏళ్లకు పైగా సమయం కేటాయించిన ప్రభాస్.. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు.  బాహుబలి-2 విడుదలై సంచలనం సృష్టించడం.. ప్రభాస్‌ నేషనల్‌ ఫిగర్‌గా మారడం..  ప్రభాస్‌తో సినిమా చేయాలని చాలామంది బాలీవుడ్ దర్శక నిర్మాతలు పోటీ పడడం.. హిందీలో బాహుబలి రైట్స్ తీసుకున్న దర్శక నిర్మాత కరణ్ జోహర్.. ప్రభాస్ హీరోగా స్ట్రయిట్ హిందీ సినిమా తీయాలని అనుకోవడం.. ఇప్పటివరకు వచ్చిన వార్తలు.. తాజా వార్త ఏంటంటే.. దేశంలోని అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల జాబితాలో నిలిచాడు..  ప్రముఖ మ్యాగజైన్ జిక్యూ అన్ని రంగాల నుండి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను ప్రకటించింది. అందులో దక్షిణాది నుండి ప్రభాస్ ఒక్కడే చోటు దక్కించుకోవడం విశేషం. ఈ లిస్ట్‌లో పీవీ సింధు, బాలీవుడ్ యాక్టర్‌ రణవీర్ సింగ్, యాక్టర్‌ రాజ్‌కుమార్ రావు ఉన్నారు..

baahubali-prabhas

ఇక ప్రభాస్‌ నటిస్తున్న సాహో సినిమాని ఎక్కడా రాజీలేకుండా యూవి క్రియేషన్స్ ప్రొడక్షన్‌ వారు 200 కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు ప్రతినాయకుడు గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ నటిస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించారు.ఈ చిత్రం మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసి తరువాత షెడ్యూల్ ను దుబాయ్ లో ప్లాన్ చేశారు. దుబాయ్‌లో భారీ యాక్షన్‌ ఫైట్లు షూట్ చేస్తున్నట్టు సమాచారం.. అదేవిధంగా బాహుబలి తెచ్చిన క్రేజ్‌ను వాడేసుకొని క్యాష్ చేసుకునేందుకు వీలైనన్ని ఎక్కువ భాషల్లో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలా ప్రభాస్ పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం బాహుబలి సినిమా అని చెప్పక తప్పదు.. ఇంతటి పేరు తెచ్చిన బాహుబలి సినిమాకి ప్రభాస్‌ సాహో అనాల్సిందే !

- Advertisement -