ఇటలీలో ప్రభాస్.. దాని కోసమే !

45
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ రిలీజ్‌కు ముందే విదేశాలకు వెళ్లారు. ఆదిపురుష్ ఫస్ట్ షో కూడా ఆయన వేరే దేశంలోనే చూసినట్టు వార్తలు వచ్చాయి. అయితే సినిమా రిలీజైనప్పటి నుంచి కనిపించకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ ఇటలీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ రూ.40 లక్షలకు ఓ విల్లాను కూడా అద్దెకు తీసుకున్నాడని టాక్‌. చాలా ప్రశాంత వాతావరణంలో ప్రభాస్ గడుపుతున్నాడట. కేవలం ప్రశాంతత కోసమే ప్రభాస్ అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, ఆదిపురుష్ సినిమాపై తీవ్రంగా విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభాస్ ఇంతవరకూ స్పందించలేదు.

మరోవైపు ఆదిపురుష్ మూవీ టికెట్ ధరలు భారీగా తగ్గాయి. మల్టీప్లెక్సుల్లో త్రీడీలో ఈ సినిమా చూసేందుకు రూ.150కే టికెట్లు అందుబాటులో ఉంటాయని చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడులకు ఈ ఆఫర్ చెల్లదని తెలిపారు. కాగా ఈ సినిమాపై రోజుకో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హనుమంతుడు దేవుడు కాదని ఆ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా అన్నారు. దీంతో పెద్ద ఎత్తున్న నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.దీనికితోడు సినిమాలో ‘హనుమంతుడి పాత్ర పలికిన డైలాగ్ లు కూడా భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయి.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

మొత్తమ్మీద ఆదిపురుష్ మూవీ వివాదాలకు కేంద్రంగా నిలిచింది. ఈ మూవీలో రామాయణంలోని పాత్రలను కించపరిచే విధంగా తీశారు. కొన్ని డైలాగ్స్ కూడా తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. ‘ఆదిపురుష్‌’ సినిమాలో లంకా దహనం సందర్భంగా హనుమంతుడు ఇంద్రజిత్తుతో చెప్పే డైలాగు (వస్త్రం నీ బాబుదే, నూనె నీ బాబుదే, నిప్పు నీ బాబుదే, ఇప్పుడు తగులబడేది కూడా నీ బాబే)లపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ డైలాగ్ ను (వస్త్రం నీ లంకదే, నూనె నీ లంకదే, నిప్పు నీ లంకదే, ఇప్పుడు తగులబడేది కూడా నీ లంకే) అని సవరించారు. ఏది ఏమైనా ప్రభాస్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నాడు.

Also Read:మంచి నీళ్లు..జీర్ణక్రియ ప్రక్రియ

- Advertisement -