హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం

287
bandaru dattatreya takes oath

బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నేడు ప్రమాణస్వీకారం చేశారు. హిమాచల్ ప్రదేశ్ 27వ గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా దత్తాత్రేయతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి ప్రమాణం చేయించారు.

himachalgov33

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, ఆ రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, దత్తాత్రేయ కుటుంబసభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర సంస్కృతిలో భాగంగా ధరించే హిమాచలీ క్యాప్‌ను సీఎం ఠాకూర్ మంగళవారం నూతన గవర్నర్‌కు అందజేసి శాలువాతో సత్కరించారు. నిన్న సాయంత్రం బీజేపీ నేతలతో కలిసి సిమ్లాకు వెళ్లారు దత్తాత్రేయ.