సంక్రాంతి రేసునుండి తప్పుకున్న స్టార్ హీరో!

370
- Advertisement -

సంక్రాంతి రేసులో సినిమాలంటే ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలపై అభిమానులకు క్రేజ్ ఎక్కువే. అందుకే సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు ఉవ్విళ్లరూతుంటారు.

అయితే వచ్చే ఏడాది సంక్రాంతి చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సారి మెగాస్టార్‌ చిరంజీవి – నందమూరి బాలకృష్ణ సంక్రాంతి రేసులో తలపడనున్నారు. జనవరి 12న చిరంజీవి…వాల్తేరు వీరయ్య, జనవరి 13న బాలయ్య వీరసింహా రెడ్డి రిలీజ్ కానున్నాయి. దీంతో పాటు ప్రభాస్ ఆది పురుష్, విజయ్ వారసుడు కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్‌.

అగ్రహీరోలు చిరు – బాలయ్య సినిమాలు ఒక్కరోజు తేడాలోనే విడుదల కానుండగా ఈసారి సంక్రాంతి రేసునుండి తప్పుకున్నారు ప్రభాస్‌. ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉండగా ప్రస్తుతం టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతి తర్వాత ఆదిపురుష్‌ని రిలీజ్ చేయనున్నారట. ప్రభాస్ అభిమానులకు నిరాశ పర్చే అంశమే అయినా సినీ ఫ్యాన్స్‌కు మాత్రం ఈసంక్రాంతి పండగే కానుంది.

- Advertisement -