ఓటీటీలో బింబిసారకు సూపర్బ్ రెస్పాన్స్‌

376
- Advertisement -

వశిష్ట దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం బింబిసార. ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడమే కాదు కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనూ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ అందిస్తూ దీపావళి కానుకగా స్ట్రీమింగ్ అవుతోంది.

జీ5లో బింబిసార స్టీమింగ్ అవుతుండోగా మంచి రెస్పాన్స్ వస్తోంది. సైన్స్ ఫిక్షనల్ అండ్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో మంచి వ్యూస్ రాబడుతోంది.

వసిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార అన్ని రకాల ప్రేక్షకుల్ని మెప్పించి మెస్మరైజ్ చేసింది. ఇప్పటికే భారీ వ్యూస్ కొల్లగొడుతూ వెళ్తున్న బింబిసారను ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి.

- Advertisement -