ముంబైలో ఆదిపురుష్..!

272
prabhas
- Advertisement -

టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకుడు. తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది.

క‌రోనా సెకండ్ వేవ్ కు కాస్తంత ముందుగా ముంబైలో షూటింగ్ మొద‌లైనా, ఆ త‌ర్వాత ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో షెడ్యూల్ కు మ‌ధ్య‌లో బ్రేక్ ప‌డింది. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆదిపురుష్ షూటింగ్ ను హైద‌రాబాద్ కు షిఫ్ట్ చేస్తున్నార‌నే వార్త‌లూ ఆ మ‌ధ్య వ‌చ్చాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ నెల ద్వితీయార్థం ప్రారంభంలోనే ముంబైలో ఆదిపురుష్ తాజా షెడ్యూల్ మొద‌లెట్టాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌.
దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌టన ఇంకా రావాల్సి ఉంది.

- Advertisement -