కెప్టెన్సీపై స్పందించిన ధావన్..!

103
dhawan

శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా, భువనేశ్వర్ కుమార్‌ను వైస్కెప్టెన్‌గా ప్రకటించగా టీమిండియాకు నాయకత్వం వహించడంపై స్పందించారు ధావన్. దేశానికి నాయకత్వం వహించడం గొప్పగా భావిస్తున్నా. మీ అందరి విషెస్​కు ధన్యవాదాలు” అని ధావన్ ట్వీట్ చేశాడు.

జూలై 13 నుంచి 25 వరకు మూడు టీ20, మూడు వన్డేలు ఆడడానికి భారత జట్టు లంకలో పర్యటించనుంది.

భారత వన్డే, టీ20 జట్టు:

శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే, హర్దిక్‌ పాండ్య, నితీశ్‌ రాణా, ఇషాన్‌కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), యుజువేంద్ర చాహల్‌, కే గౌతమ్‌, కృనాల్‌ పాండ్య, కుల్దీప్‌ యాదవ్‌, వీ చక్రవర్తి, భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైనీ, చేతన్‌ సకారియా