కేంద్ర బిల్లుతో తెలంగాణ రైతాంగం నష్టపోతోంది..

209
Power Employees JAC
- Advertisement -

రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో మింట్ కాంపౌండ్‌లోని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న అమెన్డ్ మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నిరసన తెలిపింది. బడా పారిశ్రామిక వేత్తలు కోసమే విద్యుత్‌ను ప్రయివేటికరణ చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ జూన్ 1వ తేది నాడు దేశ వ్యాప్తంగా నల్ల బ్యాడ్జ్‌లు కట్టుకుని నిరసన తెలుపుతాము అని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది.

ఈ బిల్లు తీసుకురావడం వలన సామాన్యులు చాలా ఇబ్బంది పడతారు. ఈ బిల్లు తీసుకురావడం వలన రైతుల ఉచిత కరెంట్ ఉండదు. ఎస్సి ,ఎస్టీ ,బీసీలకు విద్యుత్‌లో ఇచ్చే రాయితిలు కోల్పోయే అవకాశం ఉంటుంది జేఏసీ అంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే బిల్లు తెలంగాణ రైతాంగం నష్టపోతోంది.

వన్ నేషన్ వన్ గ్రిడ్ తీసుకురావడంతో రాష్ట్రాలు నష్టపోతాయి.రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ ఈ బిల్లుతో కోల్పోతారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దు ,సీఎం కేసీఆర్ ఇప్పటికే దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అని చెప్పారు. వారికి పూర్తి మద్దతు ఉంటుంది. అన్ని పార్టీ లు కలిసి రావాలి అని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కోరుతోంది.

- Advertisement -