జంతువుల ఎముకలతో పౌడర్ తయారీ..కంపెనీ సీజ్

14
powder

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం ఫుల్జాల గ్రామ శివారులో వ్యవసాయ పొలంలో అనుమతులు లేకుండా ఎముకలతో పౌడర్ తయారు చేసే కంపెనీ కొందరు వ్యక్తులు ఏర్పాటు చేశారు.వివిధ రకాల జంతువుల ఎముకలతో పౌడర్ చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.

గ్రామస్తులు చేసిన పిర్యాదు మేరకు సంబంధిత అధికారులు హుటాహుటిన ఎమ్మార్వో కృష్ణయ్య వారిసిబ్బందితో మరియు పోలిస్ ప్రొడక్షన్ తో కంపెనీ ని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు, వ్యవసాయ పొలంలో ఈ కంపెనీని ఎలా ఏర్పాటు చేశారు అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కంపెనీని సీజ్ చేశారు,ఇప్పటికే గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న కంపెనీని , రైతుల పేరుమీద అక్రమంగా విద్యుత్ డీడీలు కట్టి ట్రాన్స్ఫార్మర్స్ ను అమర్చారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి ట్రాన్స్ఫార్మర్స్ వైర్లు తొలగించారు,రైతుల కోసం అనుమతులు తీసుకొని ఇలా కమర్షియల్ ఉపయోగిస్తున్నారని విద్యుత్ సరఫరాను అధికారులు తొలగించారు.ఈ ఎముకల దుర్వాసనను మేము భరించలేక పోతున్నామని చుట్టుపక్కల రైతులు తెలిపారు దీనిని వెంటనే ఇక్కడి నుండి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు.