టీఆర్ఎస్..సంక్షేమ సర్కార్: మహిపాల్ రెడ్డి

13
mla mahipalreddy

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు డివిజన్ పటాన్చెరు మండల అమీన్పూర్ మున్సిపాలిటీ అమీన్పూర్ మండలం పరిధిలోని 146 మంది లబ్ధిదారులకు మంజూరైన 1కోటి 40 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. ప్రజల కష్టాలను దూరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుదన్నారు. సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేయడనే పనిగా పెట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు,పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.