కేరళం ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న కె.సి. వేణుగోపాల్‌కు హైకమాండ్ మద్దతు ఇస్తుందన్న ఊహాగానాల మధ్య, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ వాద్రాలను హెచ్చరిస్తూ వయనాడ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు వేశారు.
స్థానిక నాయకత్వాన్ని కాదని, ఢిల్లీ నుంచి ఒత్తిడి తెస్తే వయనాడ్ మరో అమేథీ అవుతుంది అని పోస్టర్లలో హెచ్చరించారు. అంటే గతంలో అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయినట్లుగానే, ఇక్కడ కూడా ఎదురుదెబ్బ తగులుతుందని పరోక్షంగా పేర్కొన్నారు.
కేరళం నాయకత్వం విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే రాబోయే ఎన్నికల్లో వయనాడ్ ప్రజల మద్దతు ఉండదని..వయనాడ్‌ను మర్చిపోవాల్సి వస్తుంది అని రాహుల్, ప్రియాంకలను ఉద్దేశించి పోస్టర్లు వెలిశాయి. కె.సి. వేణుగోపాల్ కేంద్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితుడని, స్థానిక పార్టీ అభిప్రాయాలను కాదని ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారని పోస్టర్లలో విమర్శించారు.
Also Read:కొబ్బరి సాగులో గుజరాత్ టాప్!
కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ (UDF) 140 సీట్లలో 102 సీట్లు గెలుచుకుని ఘనవిజయం సాధించింది. అయితే సీఎం పీఠం కోసం కె.సి. వేణుగోపాల్,వి.డి. సతీశన్,రమేష్ చెన్నితల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

