ఉదయం లేవగానే ఇవి అసలు తినకండి!

29
- Advertisement -

చాలామందికి ఉదయం నిద్ర లేవగానే కాఫీ లేదా టి తాగే అలవాటు ఉంటుంది. మరికొందరికి ఏవైనా తినే అలవాటు ఉంటుంది. జంక్ ఫుడ్ లేదా వేడి వేడిగా ఏదైనా స్పైసీ ఫుడ్, ఇలా ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది. అయితే ఉదయాన్నే ఏది పడితే అది తినడం వల్ల లేని సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఉదయం పూట ఏవి తినాలి ? ఏవి తినకూడదు అనే దానిపై క్లారిటీ లేకపోతే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే పడగడుపున అసలు తినకూడని కొన్నిటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఉదయం పూట నారింజా, ద్రాక్ష, నిమ్మ, కివీ పండ్లు.. వంటి వాటిని అసలు తినకూడదు.

ఎందుకంటే వీటిలో అధిక మొత్తంలో సి విటమిన్ ఉంటుంది. అంతే కాకుండా సిట్రిక్ ఆమ్లం కలిగిన ఈ పండ్లను ఉదయాన్నే పడగడుపున తినడం వల్ల ఎసిడిటీ అమాంతంగా పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఉదయం పూట వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇంకా స్పైసీ ఫుడ్స్ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే గుండెల్లో మంట, కడుపులో ఎలర్జీ, వంటివి ఏర్పడడానికి కారణం అవుతాయి. స్వీట్స్ మరియు ఎరేటెడ్ డ్రింక్స్ వంటివాటికి కూడా దూరంగా ఉండాలి. ఇవి కూడా ఉదర సమస్యలకు దారితీస్తాయి. కాఫీ మరియు టి తాగే అలవాటు ఉన్నవారు వాటిని కూడా మితంగా సేవించాలి. ఉదయం పూట విలీనంతా వరకు నట్స్, తేనె, బొప్పాయి, వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉదయం పూట మనం తీసుకునే ఆహార పదార్థాల పట్ల జాగ్రత్త వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:Pawan:టార్గెట్ పిఠాపురం..జగన్ మాస్టర్ ప్లాన్!

- Advertisement -