కరోనా బారిన పడ్డ పోసాని..

130
posani
- Advertisement -

సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి కరోనా సోకింది. పోసానితో పాటు ఆయన కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు పోసాని. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సీలతో దేవుడి దయవల్ల త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్ లకు హాజరవుతానని తెలిపారు.

తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను మన్నించమని కోరారు. తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని, అందుకు తనను మనస్ఫూర్తిగా మన్నించాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -