శ్రీలంకకు చేరిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”

145
gic

“ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగన్దినా” అన్నట్లుగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అవిశ్రాంతంగా ముందుకు సాగుతుంది. మానవ మనుగడకు నేను సైతం అనే చేతులన్నీ ఒక్కటై మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. మరో మూడు హృదయాలను కదిలిస్తున్నాయి. స్వదేశం, విదేశం అనే తేడా లేకుండా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రపంచమంత కదలిస్తుంది.

ఈ క్రమంలోనే, ఈ రోజు శ్రీలంక డిప్యూటీ హై కమీషనర్ డా. డి వెంకటేశ్వరన్ “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో భాగంగా జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ పార్క్ లో మొక్కను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టేందుకు, పర్యావరణ పరిరక్షణకు నిరంతర కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. అంతేకాదు.. సమాజం కోసం నేను అనే మహోన్నత ఆశయంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”, ప్రకృతి విలయాలతో విలవిల్లాడుతున్న నేటి ప్రపంచానికి అత్యంత ఆవశ్యకమైనది. ప్రకృతి సమతూల్యతకు, భవిష్యత్ తరాల మనుగడకు మొక్కలు నాటడం మినహా మరే పత్యామ్నాయం లేదన్న విషయాన్ని గ్రహించి ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్న సంతోష్ గారిని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

అంతేకాదు, జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని శ్రీలంకకు ఆహ్వానించి.. ప్రధాని మహీంద్ర రాజపక్సే తో కలిసి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను శ్రీలంకలో విస్తరిస్తాం.ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్ననారు.