పోసాని.. కర్మకాలి నంది అవార్డు వచ్చింది..!

74
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చ అవార్డు నంది అవార్డు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటిస్తుంది. తాజాగా టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి దీనిపై సంచలన కామెంట్ చేశారు. శుక్రవారం ఏపీ ఫైబర్‌ నెట్ ఫస్ట్ డే ఫస్ట్‌ షో సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పోసాని పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీ ఫైబర్‌ నెట్‌లో సినిమాలు చూసే అవకాశం కల్పిస్తోందన్నారు.

ఈ సందర్భంగా ఇంకా మాట్లాడుతూ… టెంపర్ సినిమాకు నాకు నంది అవార్డు వచ్చింది. నా నటనకు గానూ కర్మకాలి నంది అవార్డు ఇచ్చారు. తప్పని పరిస్థితుల్లో వేరే ఆప్షన్ లేక నాకు ఇచ్చారు. నేను కూడా వెళ్లి తీసుకున్నానని తెలిపారు. అయితే అవార్డుల కమిటీలో 11మంది ఒక వర్గం వారే ఉన్నారని అన్నారు. దీంతో అవార్డులు ఇచ్చిన తీరు చూసి నాకు నచ్చక నాకు వచ్చిన అవార్డును కూడా వద్దని చెప్పానని వివరించారు.

ఇవి కూడా చదవండి…

ఈ పెద్దమనిషికి ఇదే పని:కంగనా

గృహసారథులు.. వచ్చేస్తున్నారోచ్!

కిరణ్ కుమార్ రాకతో తీరు మారేనా ?

- Advertisement -