8000 మొక్కలు నాటిన బలరాం IRS..

183
Green India Challenge

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎన్ .బలరాం IRS మొక్కలు నాటారు. మందమర్రి ఏరియా ఈరోజు KK-5 గని ఆవరణములో తెలంగాణకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్,హరితహారం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ ఫైనాన్స్ బలరాం విచ్చేసి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో అన్ని ఏరియాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మానవ మనుగడ సురక్షితంగా ముందుకు సాగాలంటే ప్రతి మనిషికి 280 కిలోల ఆక్సిజన్ అవసరం ఉంటుందని, అందుకు ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటవలసిన ఉంటుందని. అలాగే మన ఆయు ప్రాణం బాగుండాలంటే మన రాష్ట్రంలో 33 శాతం అడవులు ఉండడం మూలానా వాతావరణంలో మంచి వర్షాలు పడతాయి ఆక్సిజన్ దొరుకుతుంది. మంచి పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు.

సింగరేణిలో మనం నాటిన మొక్కలు 90% బ్రతుకుతున్నాయి. SO TO డైరెక్టర్ PP రమేష్ రావు, GM,MM చింతల శ్రీనివాస్, TBGKS వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, AITUC బ్రాంచ్ సెక్రెటరీ S.సత్యనారాయణ, అధికారుల సంఘం అధ్యక్షుడు జక్కారెడ్డి, AGM (F&A) చక్రవర్తి, KK గ్రూప్ ఏజెంట్ రామ్ చందర్, KK-5 గని మేనేజర్ A.V రెడ్డి , PM వర ప్రసాద్, మరియు మందమరి ఏరియా అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు నాటిన 827 మొక్కలతో కలిపి నేటికి N.బాలరాం IRS 8000 మొక్కలు నాటి తమ లక్ష్యమైన10 వేల మొక్కల దిశగా ముందుకు వెళ్తున్నారు.