వర్మకు పూన‌మ్ దిమ్మతిరిగే కౌంట‌ర్‌..!

231
rgv
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నటి పూనమ్ కౌర్ దిమ్మతిరిగే కౌంట‌ర్‌ ఇచ్చింది. ‘‘బ్రేకింగ్ న్యూస్: ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నా తరవాత సినిమా టైటిల్ ‘పవర్ స్టార్’. పీకే, ఎంఎస్, ఎన్‌బీ, టీఎస్, ఒక రష్యా మహిళ, నలుగురు పిల్లలు, 8 బర్రెలు, ఆర్జీవీ పాత్రలు ఉంటాయి. ఈ పాత్రలు ఏమిటో అర్థం చేసుకున్నవారికి ఎలాంటి బహుమతులు ఉండవు’’ అని వర్మ ట్వీట్ చేశారు.

వర్మ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వివాదాలకు దారి తీస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వరుస సినిమాలతో వర్మ సంచలనం సృష్టిస్తున్నాడు. క్లైమాక్స్, నగ్నం, చిత్రాలతో వర్మ ఇప్పటికే దుమారం లేపాడు. తాజాగా ‘ప‌వ‌ర్‌స్టార్‌’సినిమా అంటూ మరో వివాదానికి తెరలేపాడు. అయితే ఇందులో న‌టించే వారి పేర్ల‌తో పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ లుక్‌ను పోలిన ఓ వీడియో విడుద‌ల చేశారు వ‌ర్మ‌.

అయితే వర్మ ట్వీట్‌కు న‌టి పూన‌మ్ కౌర్ ట్విట్ట‌ర్ ద్వారా ఘాటుగా స్పందించింది. ‘పవర్‌స్టార్’ సినిమాలో ఆర్జీవీ అనే క్యారెక్ట‌ర్‌ను కూడా యాడ్ చేయండి. అమ్మాయిల బ‌ల‌హీన‌త‌లు తెలుసుకుని వారిని ప్రేరేపించి వారికి ఇత‌రుల‌ను కించ‌ప‌రిచేలా ట్వీట్స్ పంపి వాటిని షేర్ చేయ‌మ‌ని చెప్పి, త‌ర్వాత దాని గురించి మీడియాకు చెప్ప‌మ‌ని చెబుతారు. నేను చిన్న‌తనంలో మిమ్మ‌ల్ని ఎంత‌గానో గౌర‌వించేదాన్ని..ఇప్పుడు మిమ్మ‌ల్ని చూసి బాధ‌ప‌డుతున్నాను’’ అని పూన‌మ్ కౌర్ పేర్కొంది‌.

- Advertisement -