చాలా దురదృష్టకరం.. చై-సామ్‌ విడాకులపై నాగ్‌ స్పందన..

25

టాలీవుడ్ జంట సమంత, నాగచైతన్య తామిద్దరం వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నామని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా కింగ్‌ నాగార్జున స్పందించారు. ‘‘ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని తెలియజేయాల్సి వస్తుంది. సమంత, నాగచైతన్యల మధ్య జరిగినది చాలా దురదృష్టకరం. భార్యభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం నాగచైతన్య, సామ్‌ నా హృదయానికి దగ్గరివారు. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైనది. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’’ అని నాగార్జున ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.