సూర్యతో బుట్ట బొమ్మ!

25
- Advertisement -

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే బంపర్ ఆఫర్ కొట్టేసింది. తొలిసారి సూర్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది పూజా. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా సూర్య హీరోగా నటిస్తున్నారు. సూర్య హీరోగా చేస్తున్నాడని చెప్పడంతో వెంటనే ఓకే చేసింది ఈ అమ్మడు.

ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో జూన్ నుండి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 40 రోజులపాటు సింగల్ షెడ్యూల్‌ అండమాన్‌లో ప్లాన్ చేశారు. దాని తర్వాత ఊటీ, ఏపీలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నట్లు కోలీవుడ్ టాక్.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం చాలామంది హీరోయన్లను సుబ్బరాజ్ సంప్రదించాడు. కానీ చివరకు పూజాకు ఓకే చెప్పారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 20 సినిమాలు చేయగా రీసెంట్‌గా సక్సెస్ కోసం తెగ ఎదురుచూస్తోంది. మరి సూర్యతో సినిమా ఈ బ్యూటీకి సక్సెస్‌వస్తుందా వేచిచూడాలి.

Also Read:Prabhas:పెళ్లి గురించా?,మూవీ గురించా?

- Advertisement -