తమన్నాపై షాకింగ్ కామెంట్స్‌ చేసిన పూజా హెగ్డే..

339
Actress Pooja Hegde
- Advertisement -

టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే.. మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. అంతేకాదు పూజా తన స్కూల్ డేస్ కు సంబంధించిన వివరాలను కూడా పంచుకుంది. తమన్నా నేను ఒకే స్కూల్లో చదువుకున్నామంటూ పూజా హెగ్డే షాకిచ్చింది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే వీరిద్దరి స్నేహం గురించి పలు విషయాల తెలిపిన పూజ హెగ్డే.

తమన్నా, తాను ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నామని… ఆమె తనకు సీనియర్ అని పూజ తెలిపింది. తమన్నా చాలా అందంగా ఉంటుందని కితాబిచ్చింది. ఆమెలోని కలివిడితనం తనకు ఎంతో నచ్చుతుందని పూజా తెలిపింది. సాంప్రదాయ దుస్తుల్లో అయినా, పాశ్చాత్య దుస్తుల్లో అయినా ఆమె చాలా అందంగా ఉంటుందని చెప్పింది. స్కూళ్లో ఏ కార్యక్రమం జరిగినా తమన్నా డాన్స్ చేసేదని తెలిపింది. ప్రతి ఒక్కరితో చక్కగా కలిసిపోయేదని… అందర్నీ ఒకేలా చూసేదని చెప్పింది. ప్రతి ఒక్కరినీ స్నేహితులను చేసుకునేదని పూజా చెప్పుకొచ్చింది.

- Advertisement -