అదృష్టం అంటే పూజా హెగ్డేదే !

57
- Advertisement -

అదృష్టం అంటే.. పూజా హెగ్డేదే. అరడజను ప్లాప్ లు ఇప్పటికే వరుసుగా తన ఎకౌంట్ లో పడుతున్నా.. ఇప్పటికీ సినిమాల్లో అమ్మడికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. పైగా స్టార్ హీరోలకు మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే చలామణి అవుతుంది. పూజా హెగ్డే ఇప్పటివరకు బాలీవుడ్ లో నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. లాస్ట్ సినిమా సల్మాన్ ఖాన్ తో కలిసి నటించింది. ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. సహజంగా ఇలాంటి ప్లాప్ ల హీరోయిన్ కి ఛాన్స్ లు రావు. కానీ, విచిత్రంగా ప్లాప్ అయ్యేకొద్దీ పూజా హెగ్డేకి స్టార్ డమ్ పెరుగుతుంది.

ముఖ్యంగా పూజా హెగ్డేకి బాలీవుడ్ లో ఇంకా సాలిడ్ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ భామ ఒక హిందీ చిత్రంలో మహారాణి పాత్రని దక్కించుకుందని టాక్ నడుస్తోంది. విక్కీ కౌశల్ హీరోగా ‘చావా’ అనే సినిమా రూపొందనుంది. ఇది పీరియడ్ చిత్రం. ఇందులో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ గా నటిస్తాడట. ఆయన భార్యగా పూజా హెగ్డే నటించనుంది అని తెలుస్తోంది.

Also Read:హ్యాపీ బర్త్ డే..డేవిడ్ బెక్‌హామ్

ప్రస్తుతం వస్తున్న బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. పూజా హెగ్డే మహారాణి పాత్రలో దర్శనమిస్తుంది. పైగా ఈ మహారాణి పాత్ర పోషించేందుకు పూజా హెగ్డే గుర్రపు స్వారీ, కత్తిసాము వంటి విద్యలు నేర్చుకుంటుందట. మరి మహారాణిగా పూజా హెగ్డే ఏ రేంజ్ లో అలరిస్తోందో చూడాలి. ఏది ఏమైనా పూజా హెగ్డే పెట్టి పుట్టింది. .

Also Read:బహుముఖ ప్రజ్ఞాశాలి.. సత్యజిత్‌ రాయ్‌

- Advertisement -