అభిమానులకు పూజా హెగ్డే సర్ ప్రైజ్..

189
Pooja Hegde
- Advertisement -

బాలీవుడ్‌ బ్యూటీ పూజా హెగ్డే ఈ రోజు 30వ బ‌ర్త్‌డే జ‌రుపుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్‌కు జోడీగా రాధే శ్యామ్ చిత్రంలో న‌టిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం నుండి పూజా లుక్ విడుద‌ల చేశారు చిత్రబృందం. ఈ రోజు పూజా పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న సందర్భంగా ఆమె అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

ఈ లుక్‌లో చిరునవ్వులు చిందిస్తూ ఆమె కనపడుతోన్న తీరు అలరిస్తోంది. ఈ సినిమాలో పూజ హెగ్డే పేరు ప్రేరణ అని ఈ సినియా యూనిట్ తెలిపింది. పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణంపై ఇటలీలోని పురాతన భవంతుల్లో కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 23న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. కాగా, పూజ హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

- Advertisement -