అక్కినేని అఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆరెంజ్ సినిమా ఫ్లాప్‌తో ఇండస్ట్రీకి దూరమైన బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుండగా సినిమాపై అఖిల్,భాస్కర్ ఇద్దరు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డేను సంప్రందించిందట చిత్రయూనిట్. అయితే ఇందుకోసం భారీ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసిందట పూజా. ఏకంగా రూ. మూడున్నర కోట్లు డిమాండ్ చేసిందట. పూజాను తీసుకోవడంతో సినిమాకు మరింత హైప్ వస్తుందని భావించిన నిర్మాతలు అంతమొత్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యారని టాక్.
తొలి మూడు సినిమాలతో తీవ్రంగా నిరాశపరిచిన అఖిల్ నాలుగో సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యామిలీ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆసక్తిరేపే టైటిల్ ఓకే చేసినట్లు సమాచారం.