కన్నడలో పూజా గ్రాండ్ ఎంట్రీ!

32
yash
- Advertisement -

సౌత్‌లో టాప్‌ హీరోయిన్‌గా మారిపోయింది నటి పూజా హెగ్డే. ఇప్పటికే తెలుగు, తమిళ్‌లో బిజీ ఆర్టిస్ట్‌గా ఉన్న పూజా..అగ్రహీరోలతో నటించి మంచి సక్సెస్‌ను అందుకుంది. అయితే ఇప్పటివరకు కన్నడలో ఒక్క సినిమాలో కూడా నటించలేదు ఈ అందాల భామ.

అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పూజా కన్నడలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. కేజీఎఫ్ స్టార్ యశ్‌తో ఓ సినిమాలో నటించనుందని టాక్. మఫ్టీ అనే సినిమాతో మంచి ట్యాలెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు నర్తన్‌.

ఇటీవలే యశ్ కి నర్తన్ కథ వినిపంచగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరి కన్నడలో పూజా సక్సెస్ సాధిస్తుందో లేదో వేచిచూడాలి..

- Advertisement -