“ఎల్లువొచ్చి గోదారామ్మ” ల‌వ్ యూః పూజా హెగ్డె

230
varun-tej-valmiki-

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గద్దలకొండ గణేశ్(వాల్మీకి). వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటించింది. శోభన్ బాబు, శ్రీదేవి జంటగా నటించిన దేవత సినిమాలోని ఎల్లువచ్చి గోదారమ్మ పాటను ఈసినిమాలో రిమేక్ చేశారు. గోదావరి నది ఒడ్డున వందల సంఖ్యలో బిందెలు అమర్చి అత్యంత అద్భుతంగా ఆ పాటను తీశారు. ఒరిజినల్ పాటకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.

అయితే ఈసినిమాలో కూడా అదే రేంజ్ లో ఎక్కడా తగ్గకుండా చిత్రకరించారు దర్శకుడు హరీశ్ శంకర్. ఇక ఈసాంగ్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డె డ్యాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఈ పాట రాగానే థియేటర్లలో ప్రేక్షకులు డ్యాన్స్ లు చేస్తున్నారు.

తాజాగా సినిమా హాల్స్‌లో ఫ్యాన్స్ చేస్తున్న సందడికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది హీరోయిన్ పూజా హెగ్డే. “ఇందుకోసమే నేను మైళ్లకు మైళ్లు వెళుతుంటాను. ఇటువంటి దృశ్యాలు చూస్తే, బాధలన్నీ మరచిపోతాం. మీ ఆనందం, థియేటర్లలో ఇలా నృత్యం చేయడం చూసి, మేము గడిపిన నిద్రలేని రాత్రులను, ప్రయాణాన్ని, ఎండలో నిలబ‌డి సినిమాలు చేయ‌డాన్ని… వీటన్నింటినీ మీ ప్రేమ ముందు మ‌రిచిపోతాం. ఎల్లువొచ్చి గోదారామ్మ ల‌వ్ యూ” అని ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది.