ఆదాశర్మ స్వయంవరం.. అందరూ ఆహ్వానితులే

126
Adah sharma

హార్ట్ ఎటాక్ హీరోయిన్ అందాల ఆదాశర్మ స్వయంవరం ప్రకటించింది. తనకు పెళ్లి కొడుకు కావాలంటూ ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది. పెళ్లి కుమార్తె గెటప్‌లో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి వరుడికి ఉండాల్సిన లక్షణాల గురించి కూడా వివరించింది. ఆదా శర్మ పెట్టిన ఖండీషన్స్ ఇవే..

అతను ఉల్లిపాయలు అస్సలు తినకూడదు. కులం మతం, రంగు వీసా, స్వీమ్మింగ్, కండలు ఇటాంటివి అస్సలు పట్టించుకోకుడదు. తనకు రోజుకు మూడు పూటలా వండి పెట్టాలి. అలాగే రోజు షేవింగ్ చేసుకోవాలి. తప్పకుండా సాంప్రాదాయ దుస్తులే ధరించాలి. అతనికి రోజుకు కేవలం 5లీటర్ల మంచి నీటిని మాత్రమే ఇస్తా. మద్యం, మాంసాహారానికి ఇంట్లో, బయట దూరంగా ఉండాలి. అన్ని భాషల భారతీయ చిత్రాలపై అతనికి గౌరవం ఉండాలి.. వాటిని చూసి ఎంజాయ్ చేసేవాడై ఉండాలి. అని ట్వీట్ చేసింది.

ఆదాశర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈట్వీట్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆదా ఈ ట్వీట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసింది లేక నిజంగా చేసిందా అని ఆలోచిస్తున్నారు. ఆదా శర్మ తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో అబీర్‌సేన్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మెన్ టు మెన్’ చిత్రంలో ఆమె హిజ్రా పాత్రలో నటిస్తోంది.