- Advertisement -
ముకుంద సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన పూజా హెడ్గే ఇప్పడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. తెలుగులో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకుంటోంది. ఇటివలే అల్లు అర్జున్ తో అల..వైకుంఠపురంలో సినిమాలో నటించి భారీ సక్సెస్ ను అందుకుంది. ఇక ప్రస్తుతం అమ్మడు ప్రభాస్, అఖిల్ సినిమాల్లో నటిస్తుంది.
టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అమ్మడు కు మంచి రెస్పాన్స్ వస్తుంది. హౌజ్‌ఫుల్-4 చిత్రంలో బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే .. సల్మాన్‌ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కబీ ఈద్ కబీ దివాళీ’ చిత్రంలో నటిస్తుంది. తాజాగా అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ రెండు ఇండస్ట్రీల్లో రాణిస్తుంది పూజా హెగ్డే.
- Advertisement -