సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనండి: పొన్నం

2
- Advertisement -

రాజకీయ పార్టీల నాయకులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో పాల్గొనాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మీడియాతో మాట్లాడిన పొన్నం..రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వే కు సహకరించాలని…సమాచారాన్ని ఇవ్వకుండా బీసీ లకు వ్యతిరేకంగా ఈ సర్వే నిర్వహణకు వ్యతిరేకంగా మీలో భావం ఉంటే చెప్పండన్నారు.

ప్రభుత్వం తీసుకున్న సర్వే లో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు అన్నారు. సమాచార శాఖలో మీరు భాగస్వాములై వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా అన్నారు.

ఎవరైనా రాకపోతే పోస్టులు పెట్టీ విమర్శించడం కాదు…సమాచార లోపం తో ,అవగాహన లోపంతో అధికారులు రాకపోయి ఉంటే బాధ్యతగల వాళ్లుగా మరియు ప్రభుత్వం తరుపున విజ్ఞప్తి చేస్తున్నాం.. అందరూ సమాచారాన్ని ఇవ్వండి ఈ సర్వే లో పాల్గొనండని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగిందని… రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ,అధికారులు , ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యుమరెటర్స్ నీ పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న అన్నారు.

Also Read:కీరదోసతో ప్రయోజనాలెన్నో..!

- Advertisement -