గీత దాటితే సీనియర్లైనా చర్యలు తప్పవు:పొన్నాల-జానారెడ్డి

167
jana reddy
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మాజీ సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యల మధ్య జరిగిన భేటీ గురించి ప్రధాన చర్చజరుగుతోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది.

1983 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ కి 50% సీట్లు కూడా రాకపోవడానికి కారణాలపై చర్చించారు. దీనిని అధికమించేందుకు పార్టీ వ్యహాలపై చర్చించారు. పార్టీలో క్రమశిక్షణ అత్యంత ప్రధానం… ఉల్లంఘిస్తే ఉపేక్ష ఉండరాదని ఇద్దరు నేతలు తెలిపారు.

క్రమశిక్షాణ రాహిత్యంపై ఎంత పెద్దవారైన చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపారు.. 2014లో ఇబ్రాహీంపట్నం సమావేశంలోనే క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సందర్భం ప్రస్తావనకు తెచ్చారు. అఖిల భారత స్థాయిలో క్రమ శిక్షణ ఉల్లంఘనలపై తీసుకుంటున్న చర్యలే ఇందుకు మార్గదర్శకం అన్నారు.

- Advertisement -