మరోసారి కేంద్రమంత్రి పీయూష్‌తో రాష్ట్రమంత్రుల బృందం భేటీ..

29
niranjan

ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ తో ఇవాళ మరోసారి భేటి కానుంది రాష్ట్ర మంత్రుల బృందం. సాయంత్రం 7.30 గంటలకు కృషి భవన్ లో సమావేశం జరగనుంది. ఈ భేటీకి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకానున్నారు .

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. గత సమావేశంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో బృందం లేవనెత్తిన అంశాలపై నిర్ణయం తెలపనుంది కేంద్ర ప్రభుత్వం.