బతుకమ్మ చీరల పంపిణీపై చిల్లర రాజకీయాలు

211
politics on bathukamma sarees
- Advertisement -

బతుకమ్మ చీరల పంపిణీపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు తెలంగాణ మహిళలు దగ్గర కావడం, చీరల పంపిణీని టీడీపీ, కాంగ్రెస్ నేతలు జీర్నించుకోలేకపోతున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే చీరలు అందకుండా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర, ఆయన అనుచరులు  చీరలను తగులబెట్టారని మండిపడ్డారు. పెద్దన్నలా సీఎం కేసీఆర్ అందించిన చీరలను ఏ మహిళా తగులబెట్టారు …రాజకీయ లబ్ది కోసమే సండ్ర దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు .

జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్‌లో బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా కాంగ్రెస్ నేతలు అరాచకం సృష్టించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలను లబ్ధిదారుల నుంచి చల్‌గల్ సర్పంచ్ భర్త రాజేందర్ బలవంతంగా లాక్కొని తగులబెట్టారు.చీరలను తగులబెట్టిన సర్పంచ్ భర్త రాజేందర్, మహిళా నేత లక్ష్మీపై బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కాంగ్రెస్ నేతలు ఓర్వలేకనే రాద్ధాంతం చేస్తున్నారని జగిత్యాల నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్ సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. మహిళలను కాంగ్రెస్ నేతలు రెచ్చగొడుతున్నారని ఆయన తేల్చిచెప్పారు.

పండుగ పూట ఆడపడుచులకు ఇస్తున్న ఆత్మీయ కానుక మీద కూడా అక్కసు వెల్లగక్కడం సరియైంది కాదంటున్నారు మహిళలు.  నేతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నంపై విపక్షాలకు కడుపుమంట వస్తుందన్న తెలంగాణ ఆడపడుచులు.. ప్రజల్లో సర్కారు పట్ల మంచితనాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాయని మండిపడ్డారు.

- Advertisement -