- Advertisement -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించడం దీని కోసం వంద కోట్లు డీల్‌కు రాగా అదికాస్త లీకవడంతో బీజేపీ నేతలు చిక్కుల్లో పడ్డారు.
ఇక ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఇక ఎమ్మెల్యేకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రోహిత్ రెడ్డికి 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం రోహిత్ రెడ్డికి 2+2 భద్రత ఉండగా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ సంఖ్యను 4+4కి పెంచింది. దీంతోపాటు ఆయనకు బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని కూడా కేటాయిచారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. రెండో ఆడియో లీక్
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఆడియో వైరల్
కృష్ణా బోర్డు దండగ
- Advertisement -