- Advertisement -
బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ పర్యటనకు అనుమతి నిరాకరించారు పోలీసులు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించి అక్కడ రైతు ఆత్మహత్యలు, రైతుల సమస్యలపై అధ్యయనం చేయాలనుకుంది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ.
ప్రభుత్వం ,పోలీసులు అనుమతి లేదనడంతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో పర్యటించి అక్కడ సమస్యలు తెలుసుకోవాలనుకుంది కమిటీ.
రైతు భరోసా కొన్ని గ్రామాల రైతులకు మాత్రమే జమ చేయడంతో రైతులలో ప్రభుత్వం పై అసహనం పెరిగింది. అయితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వ తీరుపై 11 గంటలకు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది కమిటీ.
Also Read:TTD: చాగంటిపై అసత్యప్రచారం..పీఎస్‌లో ఫిర్యాదు
- Advertisement -