సోలిపేట సుజాత వాహనం తనిఖీ..

250
solipeta
- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. నిన్న రాత్రి మంత్రి హరీశ్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు ఇవాళ ఉదయం టీఆర్ఎస్ అభ్య‌ర్థి సోలిపేట సుజాత రెడ్డి వాహ‌నాన్ని తనిఖీ చేశారు.

రాయ‌పోల్ మండ‌లం ఆరేప‌ల్లి వ‌ద్ద పోలీసులు త‌నిఖీలు చేపట్టగా ఆ వాహనంలో ఉన్న టీఆర్ఎస్ నేత‌లు స‌హ‌క‌రించారు. త‌నిఖీల్లో ఎలాంటి డ‌బ్బు ల‌భించ‌లేదు. అనంత‌రం ఆ వాహ‌నాన్ని పోలీసులు పంపించేశారు.

- Advertisement -