పైసా వసూల్ కాంబో మళ్లీ రిపీట్!

82
nbk

పైసా వసూల్ కాంబో మళ్లీ రీపిట్ కానుంది. పూరి జగన్నాథ్ – నందమూరి బాలకృష్ణ కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. అయితే అప్పుడే బాలయ్యతో మరో సినిమా చేస్తానని ప్రకటించిన పూరి తాజాగా ఇందుకు సంబంధించి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్‌ను ఇటీవ‌ల బాలయ్యకు వినిపించగా ఆయన ఇంప్రెస్ అయ్యారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ ప్ర‌క‌ట‌న రానుంది.

ప్ర‌స్తుతం బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో న‌టిస్తున్నారు బాలయ్య. పూరి సైతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఫైట‌ర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాక పైసా వసూల్ కాంబో మళ్లీ రిపీట్ కానుంది.