డ్రగ్స్ తీసుకున్న హేమ..పోలీసుల ఛార్జ్‌షీట్

5
- Advertisement -

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు పోలీసులు. హేమతోపాటు 88 మంది డ్రగ్స్‌ తీసుకున్నారని … రేవ్‌ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని పేర్కొన్నారు. నటి హేమ డ్రగ్స్‌ తీసుకున్న వ్యవహారానికి సంబంధించిన ఎండీఎంఏ మెడికల్‌ రిపోర్ట్‌ను కూడా జత చేశారు.

రేవ్‌ పార్టీ కేసులో హేమ ఇప్పటికే బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని తెలిసిందే. అనంతరం బెంగళూరు రూరల్‌ ఎన్డీపీఎస్‌ స్పెషల్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

మే 20న రేవ్‌ పార్టీలో పాల్గొన్న హేమకు డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్టు పోలీసులు నిర్దారించారు. డ్రగ్స్‌ కేసులో పట్టుబడటంతో నటి హేమను సస్పెండ్‌ చేస్తూ మా కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే ఆగస్టులో హేమపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.

Also Read:‘బఘీర’..రిలీజ్ డేట్

- Advertisement -