హైదరాబాద్‌లో శుక్రవారం గణేశ్ నిమజ్జనానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమజ్జన శోభాయాత్ర సజావుగా కొనసాగేలా ప్రణాళికలను సిద్ధం చేశామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. ఇందులో రేపు భాగంగా రేపు ఉదయం 6గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఎల్లుండి ఉదయం 10గంటల కల్లా నిమజ్జన ప్రక్రియ ముగుస్తుందని ఆశిస్తున్నామని… ఇప్పటికే ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేసినట్టు తెలిపారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
హుస్సేన్‌సాగర్‌లో రేపు దాదాపు 15వేలు నుంచి 20వేల విగ్రహాలు నిమజ్జనమవుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. విధుల్లో 3వేల మంది ట్రాఫిక్ సిబ్బంది ఉంటారాని రంగనాథ్ అన్నారు. సీసీటీవీ కెమెరాలు, మౌంటెడ్ వాహనాల పర్యవేక్షణలో డ్రోన్‌తో నిమజ్జన శోభాయాత్రను షూట్ చేస్తామన్నారు. ఇతర వాహనాల కోసం ప్రత్యామ్నాయ రూట్లను సూచించామని అన్నారు. ఈ నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చేవారి కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర శుక్రవారం ఉదయం 9గంటల నుంచి 9.30గంటల మధ్య ప్రారంభమవుతుందన్నారు. మధ్యాహ్నం 1గంట కల్లా ఎన్టీఆర్మార్గ్ వైపు నిమజ్జనం జరిగే అవకాశం ఉన్నట్టు రంగనాథ్ ఈ సందర్భంగా తెలిపారు.