బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు..

28
ghmc

జిహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు 32 మంది బిజెపి కార్పొరేటర్లపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంరం కార్యకర్తలపై కూడా కేసు నమోదుచేస్తామని వెల్లడించారు.

మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కార్పొరేటర్లతోపాటు, కొంత మంది బీజేపీ కార్యకర్తలు జీహెచ్ఎంసీ ఆఫీసులోకి చొచ్చుకెళ్లారు. కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలని ఆఫీస్‌ను ద్వంసం చేశారు. పూల కుండీలు విరగొట్టి…జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి నల్లరంగు పూశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.