రేషన్ పంపిణీపై అన్నిరాష్ట్రాలతో కేంద్రమంత్రి సమావేశం

20
piyush

ఆహారం & ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన ఇవాళ అన్ని రాష్ట్రాల ఆహారం & ప్రజాపంపిణీ శాఖల మంత్రులతో సమావేశం జరగనుంది. మూడు వారాల వ్యవధిలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన మోడల్ కమ్యూనిటీ కిచెన్స్ స్కీమ్‌ను రూపొందించాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. వన్ నేషన్- వన్ రేషన్ కార్డుల స్థితి, రేషన్ కార్డులకు ఆధార్ కార్డుల జోడింపు, బయోమెట్రిక్ ఎఫ్ పి ఎస్ లావాదేవీలు అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.