- Advertisement -
వివాదాస్పద నటీ కంగనా రనౌత్‌పై మరో కేసు నమోదైంది. అయితే ఈ సారి సిక్కు కమ్యూనిటీ నుండి విమర్శలు ఎదుర్కొంది కంగనా. కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత కంగనా కేంద్రంపై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో సిగ్గుచేటు అంటూ పోస్ట్ చేసింది.
ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ కంగనాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సిక్కు కమ్యూనిటీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ వారు ఆరోపించారు. మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోని సైబర్ సెల్‌లో కంగనాపై ఈ ఫిర్యాదు నమోదైంది.
కంగనా మొదట ఉద్దేశపూర్వకంగా రైతు ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంగా అభివర్ణించిందని, ఆ తర్వాత ఆమె సిక్కు సమాజంపై అభ్యంతరకరమైన, అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించిందని పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ఫిర్యాదుతో కంగనాపై కేసు నమోదుచేశారు పోలీసులు.
- Advertisement -