రణవీర్‌పై పోలీస్ కేసు!

74
ranveer
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్‌కు షాక్ తగిలింది. న్యూడ్ ఫోటోషూట్ చేసినందుకు ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. మహిళల మనోభావాలను దెబ్బతీశారనే ముంబైకి చెందిన ఓ ఎన్జీఓ చెంబూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేశారు పోలీసులు.

ఓ మ్యాగజైన్ కోసం రణవీర్ న్యూడ్ ఫొటోషూట్ చేశాడు. అలాగే కేవలం కట్ డ్రాయర్ మీద కూడా ఫొటోలకి ఫోజులిచ్చాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక సోషల్ మీడియాలో ఈ ఫోటోల మీద భారీగా ట్రోలింగ్ జరుగుతుంది. టీఎంసీ ఎంపీ, బెంగాలీ నటి మిమీ చక్రవర్తి ఈ విషయంపై సీరియస్ అయి ఒక మహిళ ఇలాగే ఫోటోషూట్‌ చేస్తే ప్రశంసిస్తారా అని ప్రశ్నించింది.

- Advertisement -