రేవంత్ రెడ్డి రాక్షస పాలనకు ఇది మరో నిదర్శనం. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు బీఆర్ఎస్ కార్యకర్తను అరెస్ట్ చేశారు పోలీసులు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కందికంటి నాగేంద్రబాబును అరెస్ట్ చేశారు పోలీసులు.
నాగేంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసారంటూ నకిరేకల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ కార్యకర్తలు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ కార్యకర్తను విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
చట్టానికి విరుద్ధంగా మా కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు. ఇప్పటికైనా పోలీసులు పద్దతి మార్చుకోవాలి..మా కార్యకర్త నాగబాబును ఊరిలోకి పోతే చంపుతా అని బెదిరిస్తున్నారు.. అతని పై కూడా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
Also Read:ఆటో కార్మికుల ఆత్మహత్యలు..ప్రభుత్వ హత్యలే!

