సీతక్కకు మావోల సంచలన లేఖ

5
- Advertisement -

సీతక్క నియోజకవర్గంలో ఆదివాసీలపై దౌర్జన్యం జరగడం సిగ్గుచేటు అని మండిపడ్డారు మావోయిస్టులు. ఈ మేరకు మంత్రి సీతక్కకు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సంచలన లేఖ రాసింది.

అదానీ, అంబానీల కోసం ఆదివాసీలను తరిమేస్తారా? చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి సొంత అక్క లాంటిది అని చెప్పుకునే సీతక్క నియోజకవర్గంలో ఆదివాసీలపై అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటుంది ? చెప్పాలన్నారు.

మోడీ, అమిత్ షా మానస పుత్రికలైన అదానీ, అంబానీలకు అటవీ భూమి కట్టబెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవో 49 అమలు చేసింది… వన్యప్రాణుల సంరక్షణ పేరుతో 339 గ్రామాలను ఖాళీ చేయించి, ఆ అటవీ భూములన్నీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు సీతక్క భారీ కుట్ర చేస్తుంది అని ఆరోపించారు.

జంతు సంరక్షణ పేరుతో కొమురం భీం ఆసిఫాబాద్, ములుగు, భద్రాది జిల్లాలను తెలంగాణ చిత్రపటం నుండి తుడిచివేసే ప్రయత్నం చేస్తున్నారు….రేవంత్ రెడ్డి కేబినెట్ లో అత్యంత కీలకమైన మంత్రి హోదాలో ఉండి, ఆదివాసీలపై దౌర్జన్యం జరుగుతుంటే సీతక్క మౌనంగా ఉండడం దుర్మార్గమని లేఖలో పేర్కొంది మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ.

Also Read:ఆటో కార్మికుల ఆత్మహత్యలు..ప్రభుత్వ హత్యలే!

- Advertisement -