జగన్‌ విషయంలో తొందరపాటు వద్దు:హైకోర్టు

7
- Advertisement -

మాజీ సీఎం జగన్ విషయంలో తొందరపాటు చర్యలు వద్దు అని ఏపీ పోలీసులను ఆదేశించింది హైకోర్టు. పల్నాడు పర్యటనలో జగన్ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతిచెందిన ఘటనలో, జగన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఈ నేపధ్యంలో హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్ విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది ఏపీ హైకోర్టు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లారు పోలీసులు. సింగయ్య మృతి కేసులో నోటీసులు అందజేశారు గుంటూరు జిల్లా పోలీసులు. నోటీసులు అందజేసి.. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు.

Also Read:ఎస్‌జె సూర్య… “కిల్లర్”

- Advertisement -