ఎమ్మెల్యే సీత‌క్క త‌ల్లిదండ్రుల‌కు ‘పోడు’ ప‌ట్టాలు..

83
- Advertisement -

రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోంది. లబ్దిదారులైతే చాలు వారు ఏ పార్టీ వారైన సరే వారికి ప్రభుత్వ పథకాలు అందాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దానిని తుచా తప్పకుండా పాటిస్తున్నారు అధికారులు.

తాజాగా రాష్ట్రంలో ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న పోడు పట్టాలను పంపిణీ చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారు సీఎం కేసీఆర్.తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు అందజేశారు. పోడు భూముల పట్టాల పంపిణీ రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తున్నది. అడవిని నమ్ముకొని వందల ఏండ్లుగా జీవిస్తున్న ఆదివాసీ బిడ్డలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు.

పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు భూమి పట్టాలను తాసిల్దార్ సత్యనారాయణ స్వామి అందజేశారు.

Also Read:కాంగ్రెస్ కే క్లారిటీ లేదా?

- Advertisement -