పోచారంకు నిధులు ఇవ్వలేం:పీసీసీ చీఫ్

5
- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.. సొంత ప్రభుత్వంపైనే యుద్ధం ప్రకటించారు. నిధుల మంజూరు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదని పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారు. నిధులు మంజూరు చేస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ఎత్తడం లేదు. ఒక మంత్రికి కనీసం 20 సార్లు ఫోన్ చేశాను. ఈ వయస్సులో నేను నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చెప్పాలన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంట్లో కూర్చున్నా జీవోలు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉందా.. ఉంటే అది పని చేస్తుందా? అనే అనుమానం కలుగుతోంది అన్నారు.పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెంటనే స్పందించారు. నిధుల విషయంలో ఆయన కుండబద్దలు కొట్టారు.

Also Read:వరుణ్ తేజ్..’కొరియన్ కనకరాజు’!

సిద్దాపూర్ రిజర్వాయర్ కోసం ఇప్పట్లో నిధులు మంజూరు చేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.ఆర్థిక పరిస్థితులు లేదా ఇతర ప్రాధాన్యతల దృష్ట్యా నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.

- Advertisement -