హైడ్రా అంటే కూల్చడమేనా?:హరీష్‌

8
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా హైడ్రా (HYDRAA) కూల్చివేతలు మరియు రైతుల సమస్యల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం అంటే పేదలకు గూడు ఇవ్వాలి కానీ, ఉన్న గూడును లాక్కోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

చిన్న పిల్ల ఇంట్లో ఉండగానే కూల్చేస్తారా?”హైదరాబాద్‌లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలపై హరీష్ రావు స్పందిస్తూ, మానవత్వం లేని చర్యలని అభివర్ణించారు. నిన్న ఒక చిన్న పిల్ల ఇంట్లో ఉండగానే ఇల్లు కూల్చేయడం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. కనీసం ఇంట్లోని సామాన్లు కూడా బయటకు తీసుకోనివ్వకుండా కూల్చేయడం ఇంత దుర్మార్గమా?” అని ప్రశ్నించారు.

హైడ్రా అంటే కేవలం పేదల బ్రతుకులను కూల్చడానికే పెట్టారా అని ఆయన రేవంత్ రెడ్డిని నిలదీశారు. ప్రభుత్వం పేదలకు అండగా ఉండాలి కానీ, వారిని రోడ్డున పడేయకూడదని హితవు పలికారు. మీషన్లపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదా?”పంట కొనుగోళ్లు మరియు విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. రైతులకు మద్దతు ధర దక్కడం లేదు, పంట కొనుగోళ్లు జరగడం లేదు. నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ విషయాలను నీకు చెప్పడం లేదా? లేక రైతులే కదా అని చిన్నచూపు చూస్తున్నావా? అని సీఎంను ప్రశ్నించారు.

సాయంత్రం 4 గంటలకు పోతే మళ్లీ ఉదయం 8 గంటలకు కరెంట్ వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, కనీసం కరెంట్ కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇదని విమర్శించారు.వాగ్దానాల విస్మరణ: రైతుబంధు ఇవ్వడం లేదని, బోనస్ ఊసే లేదని, కనీసం మద్దతు ధరకు పంటను కొనే దిక్కు కూడా లేదని హరీష్ రావు ధ్వజమెత్తారు. రివ్యూలు కమీషన్ల కోసమేనా?”ఎప్పుడు చూసినా భూములు, కమీషన్లు, కాంట్రాక్టుల మీదనే రివ్యూలు చేస్తావా.. ఒక్క రోజైనా రైతుల కష్టాల మీద రివ్యూ చేశావా? అంటూ రేవంత్ రెడ్డిపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. పేదల గూడు కూల్చడం, రైతులను గోస పెట్టడం ఈ ప్రభుత్వానికి తగదని ఆయన హెచ్చరించారు.

Also Read:వరుణ్ తేజ్..’కొరియన్ కనకరాజు’!

- Advertisement -