ప్రజాహితమే ధ్యేయంగా పనిచేస్తా:పోచారం

224
Pocharam
- Advertisement -

ప్రజాహితమే ధ్యేయంగా అందరి సహకారంతో పనిచేస్తానని తెలిపారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం మాట్లాడిన పోచారం తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

సభలో అధికార,విపక్ష సభ్యులకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తానని చెప్పిన పోచారం..ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సమాజంలోని అట్టడుగువర్గాలకు న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో అందరు తనకు సహకరిస్తారని ఆశీస్తున్నానని చెప్పారు.

విధుల నిర్వహణలో న్యాయబద్ధంగా వ్యవహరిస్తానని చెప్పారు.అధికార,విపక్షాలు కలిసినడిస్తేనే సభ గౌరవం పెరుగుతుందన్నారు.అసెంబ్లీని ప్రజాసమస్యల చర్చించడానికి వాటి పరిష్కారానికి కృషిచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం కల్పించి లక్ష్మీ పుత్రుడు అని నామకరణం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -