- Advertisement -
కేరళ అసెంబ్లీని సందర్శించారు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి. వ్యక్తిగత పనులపై కేరళ రాజధాని తిరువనంతంపురం వెళ్లిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన పని ముగించుకున్న అనంతరం కేరళ రాష్ట్ర అసెంబ్లీని సందర్శించారు. కేరళ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పి. రామకృష్ణన్ పోచారం శ్రీనివాస్ రెడ్ఢికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా శాసనసభ సమావేశాల నిర్వాహణ, ఇతర అంశాలపై ఇరువురు స్పీకర్లు చర్చించారు.అనంతరం కేరళ అసెంబ్లీ తరుపున పోచారం గారికి జ్ఞాపికను, పుస్తకాలను శ్రీరామకృష్ణన్ గారు బహుకరించారు. కార్యక్రమంలో కేరళ అసెంబ్లీ స్పీకర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -