తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శం.. పోచారం

340
speaker pocharam
- Advertisement -

నేడు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కో అపరేటివ్ మేనేజ్మెంట్‌లో 67వ హెచ్‌డీసీఎం బ్యాచ్‌కు సర్టిఫికెట్స్ ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరైయ్యారు. ఇందులో ఐసీఎం డైరెక్టర్ తంగిరాల సంపత్ కుమార్, ముద్ర బ్యాంక్ అధ్యక్షుడు రామదాసప్ప నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు.

pocharam srinivas reddy

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. శిక్షణ ఎంత గొప్పవారికైనా అవసరమే.. ఇది నిరంతర ప్రక్రియ. మనిషి ఎదగడానికి దోహదపడుతుంది. సహకార సంస్థ ఉద్యమాన్ని, వాటి ద్వారా జరిగే కార్యక్రమాలను ఐసీఎం శిక్షణ తరగతులు నిర్వహించడం మంచి విషయం అని ఆయన అన్నారు. ఇక్కడ 67వ బ్యాచ్ శిక్షణ పొంది ధ్రువీకరణ పత్రలు పొందినవారికి పోచారం అభినందనలు తెలిపారు.సహకార ఉద్యమం చాలా గొప్పది.సమాజ ఉద్దరణ, శ్రేయస్సు కొరకు ఉపయోగపడే ఉద్యమం.నా రాజకీయ జీవితం ఒక సహకార సంఘానికి అధ్యక్షుడిగా మొదలైంది.సహకార సంస్థల ద్వారా చాలా చక్కటి సేవలు అందించొచ్చు..

సమాజ శ్రేయస్సు కోసం మీరు ఇక్కడ తీసుకున్న శిక్షణ ఉపయోగపడాలి.శిక్షణ తీసుకున్న సంస్థకు మంచి పేరు తీసుకువచ్చేలా చిత్తశుద్ధితో పనిచేయాలి.తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన దిశగా చిత్తశుద్దితో ముందుకు సాగినం.రాష్ట్రంలో 1లక్ష 34 వేల మంది 65లక్షల క్వింటాళ్ల విత్తన ఉత్పత్తి చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ చర్యల పట్ల ఆసియా ఖండంలో మొదటిసారి హైదరాబాద్‌లో ఇస్టా కాంగ్రెస్ మీటింగ్ జరిగింది.ఇస్టా కాంగ్రెస్‌కు మన అధికారికేశవులును వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు.. ఇది ఎంతో గొప్ప విషయం.చిత్తశుద్ధితో పనిచేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు.దాదాపు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని స్పీకర్‌ తెలిపారు.

- Advertisement -